17 April, 2026 | 11:55 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

సికింద్రాబాద్ మిలిటరీ స్థావరంలో కలకలం

21-06-2025 01:20 AM

నకిలీ ఐడీలతో చొరబడిన నలుగురు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో అత్యంత సున్నితమైన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లోకి శుక్రవారం నకిలీ సైనిక గుర్తింపు కార్డులతో నలుగురు ప్రవేశించారు.  తిరుమలగిరిలోని  టెక్నోచౌక్ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు నకిలీ  ఎయిర్ ఫోర్స్ అధికారి గుర్తింపు కార్డులను చూపించి లోపలికి ప్రవేశించారు.

అనంతరం ఆర్మీకి చెందిన రహస్య ప్రాంతంలో సామగ్రిని ఫొ టోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడున్న భద్రతా అధికారులు గమనించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు.

వారు సమర్పించిన గుర్తింపు కార్డులు నకిలీవని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నలుగురిలో సయ్యద్ జమీల్, మహమ్మద్ ముస్తఫా అనే ఇద్దరిని పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన సైనిక అధికారులు, లెఫ్టినెంట్ కల్నల్ ద్వారా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.