12 July, 2026 | 3:13 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

జాతీయ రహదారిగా అల్లాదుర్గ్-మెటల్ కుంట రోడ్డును మార్చండి

25-03-2025 01:31 AM
  • కేంద్ర మంత్రి గడ్కరీ ని కోరిన గంగా జోగినాథ్ గుప్త 

సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ 

అందోలు, మార్చి 24: అందోలు నియోజకవర్గంలోని మలుపులు లేని రోడ్డుగా పేరుగాంచిన అల్లాదుర్గం- మెటల్ కుంట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి పునర్నిర్మించాలని జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్త కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రినితిన్ గడ్కరీని కోరారు.

సోమవారంనాడు మాజీ ఎంపీ బీబీ పాటిల్ సూచన మేరకు.. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో జోగినాథ్.. నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు పై ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ఆయన నితిన్ గడ్కరీకి వివరించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబై ని  కూడా ఈ దారి కలుపుతుందన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ రోడ్డు ఇటీవల పూర్తిగా ధ్వంసమైందని కేంద్ర మంత్రితో పేర్కొన్నారు.. గంగా జోగినాథ్ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.