16 May, 2026 | 1:49 AM

కార్పొరేట్ బ్యాడ్మింటన్ పోటీలు షురూ

16-05-2026 01:02 AM

హైదరాబాద్, మే 15: సతమతమయ్యే కార్పొరేట్ ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండో సీజన్ ఉత్సాహంగా మొదలైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ పో టీలను ప్రారంభించారు.

గచ్చిబౌలీలోని పు ల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.  మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్ , డెల్, యాక్సెంచర్, ఎల్ అండ్ టీ, పెగాసిస్ట మ్స్ ఇండియా, డెలాయి ట్, ఒరాకిల్, వంటి దిగ్గజ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ప్రస్తుత బిజీ జీవితంలో అం దరూ పని ఒత్తిడితోనూ, సోషల్ మీడియాతోనూ గడుపుతు న్నారనీ, వాటికి దూరంగా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ రమేష్‌రెడ్డి చెప్పారు.

ప్రతీ ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఫోన్లు, సో షల్ మీడియాకు దూరంగా ఉంచి క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. కార్పొరేట్ ఉద్యోగులు వారాంతంలో ఇంతభారీ ఎత్తున పో టీల్లో పాల్గొనడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని  గోపీచంద్ అన్నారు. ఐదు రోజులు ఉద్యోగంలో బిజీగా గడిపి, మిగిలిన రెండు రోజులు కుటుంబంతోనూ, ఇలా క్రీ డల్లో పాల్గొంటూ ఉల్లాసంగా ఉండాలన్నారు.