26 August, 2026 | 7:50 PM

ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

26-08-2026 06:52 PM

కోయిల కొండ ఆగస్టు 26(విజయక్రాంతి): మిలాద్ ఉన్ నబి పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలో మమ్మద్ ప్రవక్త నామస్మరణంతో పాత పోలీస్ స్టేషన్ నుంచి ముస్లిం సోదరులు ర్యాలీగా చౌరస్తా వద్దకు చేరుకున్నారు. పలువురు నాయకులు ముస్లిం సోదరులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగరాజు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జామా మజీద్ కమిటీ సభ్యులు. పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.