26 August, 2026 | 7:49 PM

ఘనంగా నగర మేయర్ కొలగాని జన్మదిన వేడుకలు

26-08-2026 06:53 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో మేయర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని దేవుడిని, అమ్మవారిని ప్రార్థించారు. మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా   బండి సంజయ్ కుమార్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.