28 June, 2026 | 2:07 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ప్రధాన రహదారి కల్వర్టు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

17-10-2024 09:38 PM

కాప్రా,(విజయక్రాంతి): చర్లపల్లి  డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని  డివిజన్ కార్పొరేట్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఐజి కాలనీ కల్వర్టు పక్కన ఉన్న రోడ్డు పలు కాలనీలను కలిపే ప్రధాన రహదారి, ఐజి కాలనీ, సెయింట్ జోసెఫ్ కాలనీ, నేతాజీ నగర్, వి ఆర్ కాలనీ,  విద్యా మారుతి నగర్, అంబేద్కర్ నగర్, టీఎస్ కాలనీ, లక్ష్మీ నగర్, డిసి కాలనీ, డాక్టర్స్ కాలనీ, లోకమాత కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించి స్థానిక సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ లో సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తాం పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.