21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

అద్దె చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయానికి తాళం

17-10-2024 09:32 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): అద్దె చెల్లించని కారణంగా ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన ఘటన గురువారం నిజాంబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని సూర్య నారాయణ 26 నెలలుగా తన ఇంటికి అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు. ఈ సంఘటన నిజాంబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. 26 నెలలుగా అద్దె చెల్లించకుండా ఎలా ఉన్నారు. అంటూ కలెక్టర్ ఎంపీడీవోను ప్రశ్నించినట్లు సమాచారం. జెడ్పీ సీఈవో సాయ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో అద్దె చెల్లిస్తామని సూర్యనారాయణకు అధికారులు హామీ ఇవ్వడంతో మనసు మార్చుకొని ఎంపీడీవో కార్యాలయం తాళం తీసి అధికారులకు అప్పగించాడు . ఈ నెలలోగా అద్దె చెల్లించకుంటే కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లాలని సూర్యనారాయణ అధికారులకు తేల్చి చెప్పారు.