8 August, 2026 | 2:34 AM

గణనాథ సన్నిధిలో కార్పొరేటర్ దంపతులు ప్రత్యేక పూజలు

02-09-2025 10:16 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలోని శ్రీభవానివాని నగర్ అమ్మవారి ఆలయంలో  ఏర్పాటుచేసిన శ్రీ మహాగణపతి వ్రతం లో 59 వ డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వసంత మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీభవాని మాత ఆలయంలో  ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ వరసిద్ధి గణపతి వ్రతంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

కాలనీవాసులందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, గణపతి దేవుని  ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ దంపతులను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీవాసుల ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఆలయ పూజారి, భక్తులు పాల్గొన్నారు.