8 August, 2026 | 2:48 AM

యాదవుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

08-08-2026 01:54 AM
  1. 21 రోజుల ‘శ్రీకృష్ణ సేవా  విద్యానిధి యాత్ర’ను విజయవంతం చేయాలి
  2. యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్

మంథని, ఆగస్టు 7(విజయ క్రాంతి) యా దవుల అభివృద్ధి, ఐక్యత, సామాజిక చైతన్యమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న 21 రోజుల ‘శ్రీకృష్ణ సేవావిద్యానిధి యా త్ర’ను విజయవంతం చేయాలని యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ పిలుపునిచ్చారు. మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో శుక్రవారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు యాదవ సంఘం నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా మేకల మల్లే శం యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు  సాగినప్పుడే సామాజికంగా, ఆర్థికంగా, వి ద్యాపరంగా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ముఖ్యంగా యాదవ విద్యా ర్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు చే యూత అందించడంతో పాటు, పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు శ్రీకృష్ణ సేవావిద్యానిధి యాత్ర చేపట్టినట్లు తెలిపారు .రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 21 రోజుల పా టు కొనసాగనున్న ఈ యాత్రలో యాదవ సమాజ సభ్యులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, సంఘా న్ని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలి పారు.

విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక చైతన్యంపై విస్తృతంగా అవగాహన క ల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఆగస్టు 14న ప్రారంభమయ్యే ఈ యాత్రలో యాదవ సోదరులు, యువత, మహిళలు, విద్యార్థు లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

యాదవుల ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో యా దవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరేం తిరుపతి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి భాష అశోక్ యాదవ్, ట్రస్ట్ సభ్యుడు పర్ష బక్కన్న యాదవ్, జిల్లా నాయకుడు కనవేన శ్రీనివాస్ యాదవ్, మంథని మండల యాదవ సంఘం అధ్యక్షుడు మోహన్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు వేముల లక్ష్మణ్ యాదవ్, కనగంటి ఓదెలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.