calender_icon.png 5 June, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైరయ్య ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన వేడుకలు

03-06-2025 07:29:23 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణం కాళ్ళకుంట కాలనీ 11వ వార్డులో పార్వతి బైరయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Thanneeru Harish Rao) జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీ భైరయ్య మాట్లాడుతూ... జనహృదయ నేత హరీష్ రావు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. హరీష్ రావు పుట్టినరోజు అంటే అందరికీ పండుగ రోజు కావున అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం కేకు కట్ చేసి ప్రజలకు పంచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కడవేరుగు రాజనర్సు తదితర బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. పార్వతి బైరయ్యతో పాటు కాళ్లకుంట కాలనీ కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, బెజ్జంకి బాపురెడ్డి, బొగ్గూట సాయిలు, మిట్టపల్లి బాలమల్లు, సూకరి లింగం తదితరులు పాల్గొన్నారు.