24 March, 2026 | 1:52 AM

కార్పొరేటర్ కొప్పుల గృహ నిర్బంధం

24-03-2026 12:15 AM

నాగోల్, మార్చి 23(విజయక్రాంతి): తెలంగాణలో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బం ధాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి విమర్శించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా తనను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారని తెలిపారు. ప్రజాస్వా మ్యం లో నిరసన తెలిపే హక్కును అణిచివేయడం తగదన్నారు. పోలీసులను వెంట తీసుకొని డివిజన్లోనే పర్యటించిన ఆయన, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.