16 March, 2026 | 9:02 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది

19-07-2024 01:08 AM

బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై18 (విజయక్రాంతి): అత్యంత తక్కువ సమ యంలో అత్యంత ఎక్కువగా అవినీతి, అక్రమాలకు పాల్పడింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ విమర్శించారు. అన్ని శాఖల్లో మంత్రులు పదేళ్ల దాహాన్ని తీర్చుకునేలా అవినీతికి పాల్పడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా ‘ఆర్’ ట్యాక్స్‌తో అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. వానలతో చెరువులు నింండుతున్నా చెరువుల్లో చేప పిల్లల పంపిణీని ఇంతవరకు ప్రారంభించలేదన్నారు.