17 April, 2026 | 7:11 PM

కాళేశ్వరంలో అవినీతి జరిగింది

14-06-2025 01:21 AM
  1. అందుకే కేసీఆర్‌ను విచారణకు పిలిచారు 
  2. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబంపై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చర్లపల్లి జైల్లో ఉండేవారని పీసీసీ ప్రధానకార్యదర్శి గజ్జల కాంతం పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై పూర్తి విచారణ జరిపి, దోషులను తీహార్ జైలుకు పంపించాలని డిమాండ్‌ చేశారు.

గజ్జెల కాంతం శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగా ణ ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవి నీతి జరిగింది కాబట్టే కేసీఆర్‌ను విచారణకు పిలిచారని, అవినీతి జరిగితే సీఎంమైనా, ప్రధానైనా విచా రణకు పిలుస్తారని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే.. తెలం గాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. హైదరాబాద్ చుట్టూ 30 వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.