17 April, 2026 | 5:47 PM

‘సకుర’ సైన్స్ ఎగ్జిబిషన్‌కు ముగ్గురు తెలంగాణ విద్యార్థులు

14-06-2025 01:19 AM

17 నుంచి 21 వరకు జపాన్‌లో ఎగ్జిబిషన్ 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): జపాన్‌లో ఈ నెల 17 నుం చి 21 వరకు నిర్వహించే సకుర సైన్స్ ఎగ్జిబిషన్‌కు ముగ్గురు తెలంగాణ వి ద్యార్థులు ఎంపికయ్యారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఇన్‌స్పు ర్ జాతీయ పోటీల్లో విజేతలైన వీరు జపాన్‌లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశాన్నిద క్కించుకున్నారు. 

నారాయణపేట జిల్లా దామ రగిద్ద సోషల్ వెల్ఫేర్ గురుకుల వి ద్యార్థి శివారెడ్డి, మంచిర్యాల శ్రీచైత న్య పాఠశాల విద్యార్థి సాయి శ్రీవల్లి, కరీంనగర్‌పారమిత హెరిటేజ్ స్కూ ల్ విద్యార్థి శుభశ్రీ సాహు ఉన్నారు.