3 July, 2026 | 8:43 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

23-10-2024 03:50 PM

రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన విద్యుత్ శాఖ లైన్మెన్

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ లైన్మెన్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని కరకవాగు ప్రాంతంలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, విద్యుత్ ను తన మేనమామ ఇంటి నుంచి వినియోగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లైన్మెన్ నాగరాజు ఇంటి నిర్మాణానికి దొంగ కరెంటు వాడుతున్నావని మీపై కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.68000 ఇవ్వాలని తొలుత డిమాండ్ చేసి, తర్వాత 30,000, చివరికి రూ.26 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సదరు ఇంటి యజమాని ఏసీబీ అధికారులను అప్రోచ్ కాగా బుధవారం లైన్మెన్ నాగరాజుకు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారించగా డిమాండ్ చేసిన మాట, లంచం తీసుకున్న మాట వాస్తవమని అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.