3 July, 2026 | 9:19 PM

Breaking News

ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •  

కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ

03-07-2026 08:31 PM

మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏకరూప దుస్తులు,నోట్ బుక్స్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రభుత్వం బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కేజీవీబీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలతో పాటు అవసరమైన అన్ని సామాగ్రి ఉచితంగా అందిస్తోందని తెలిపారు. విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.