3 July, 2026 | 9:36 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు..

23-10-2024 04:09 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై ఆరోపణలు సహించేది లేదని అని ఆర్జిపిఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి హెచ్చరించారు. బుధవారం స్థానిక విశ్రాంతి భవన్ లో లక్షెట్టిపేట పట్టణంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో భూకబ్జా, అక్రమ, మట్టి, దందాలకు అధికారులను, ప్రజలను బెదిరింపులకు గురిచేయగా గత ప్రభుత్వంలో అయినా కేసులపై ఇపుడు చట్టం తనపని తను చేసుకుంటూ వెళ్తుందన్నారు. అలాగే  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై, నిరాదరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిదే దేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తన అనుచరులు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ప్రయత్నింస్తున్నారని తప్పు చేసిన వారు ఎంతటివారైనా, కాంగ్రెస్ ప్రభుత్వం శిక్షిస్తుందని హెచ్చరించారు.

ముత్తే సత్తయ్య గతంలో తమ భూమి ఒక దగ్గర చూపించి వేరే చోట పట్టా చేపించారని గతంలో ఎమ్మెల్యే దివాకర్ రావు దగ్గరికి వెళ్లి నా బాధను విన్నావిచుకున్న పని కాలేదని బాధితులు చెన్న కళావతి మీడియా సమావేశంలో తమ గోడు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు పూర్ణచేందర్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, డీసీసీ అధికార ప్రతీనిది బియ్యల తిరుపతి, యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, రాందేని వెంకటేష్, బొప్పూ సుమన్, మరియు కౌన్సలర్లు, మాజీ ఎంపీటీసీ లు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.