21 March, 2026 | 6:55 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

‘ఎయిర్‌బస్’పై కాస్మిక్ రేడియేషన్ ఎఫెక్ట్

30-11-2025 01:18 AM
  1. ‘ఏ320’ మాడల్ విమానాల్లో సాంకేతిక సమస్యలు

ఫ్లుట్లై సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌పై సూర్యుడి కిరణాల ప్రభావం

కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద సమస్య 

ప్రపంచవ్యాప్తంగా 6 వేల విమానాలకు మరమ్మతులు

న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రపంచ ప్రఖ్యా తి చెందిన ‘ఎయిర్‌బస్’ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నది. కం పెనీ తయారు చేసిన ఏ318, ఏ319, ఏ320, ఏ321 విమానాలు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ, ‘ఏ320’ మాడల్ విమానాలు మాత్రం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే కాస్మిక్ రేడిషయన్ కిరణాలు విమాన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

రేడియేషన్ తీవ్రత కారణంగా విమానం ఎత్తును నియంత్రించే కంప్యూటర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో కంపెనీ యుద్ధప్రాపతికదికన నిపుణులను రంగంలోకి దింపి మొత్తం 6,000 ఏ320’ మాడల్ విమానాలకు మరమ్మతులు చేయిస్తున్నది. ఇప్పటివరకు కంపెనీ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇదే కావడం గమనార్హం. కాస్మిక్ రేడియేషన్ కిరణాల ప్రభావం ప్రధానంగా విమానాల్లోని ఎలివేటర్ ఎయిలెరాన్ కంప్యూటర్ (ఈఎల్‌ఏసీబీ)పై పడుతోందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ మొదటిసారి ఈ సమస్యను అక్టోబర్ 30న గుర్తించింది.

కంపెనీకి చెందిన ఓ ‘ఏ320’ విమానం ఆరోజు ఉన్నట్టుండి క్రాష్ అయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. 15 మంది ప్రయాణికులు మాత్రం గాయపడ్డారు. ఘటనతో ఈయూ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ)  తక్షణం స్పందించింది. ‘ఎయిర్‌బస్’ ‘ఏ320’ విమానాలను కాస్మిక్ రేడియేషన్ తట్టుకునేలా అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సదరు కంపెనీ యుద్ధప్రాతిపదికన ఆ మాడల్ విమానాలకు మరమ్మతులు చేయిస్తున్నది.