16-02-2026 12:00:00 AM
చిట్యాల, ఫిబ్రవరి 15 : మహా శివరాత్రి ఉత్సవాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు ఆలయాలలో శివపార్వతుల కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గల శ్రీ కంఠమహేశ్వర ఆలయంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఉన్న భక్తులను పలకరించి యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పిఎసిఎస్ మాజీ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ జెడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి, పొలగోని స్వామి, సుంకరి బిక్షం, రవీందర్ గౌడ్, గుత్తా వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.