calender_icon.png 16 February, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వరాలయంలో ఘనంగా ఉత్సవాలు

16-02-2026 12:00:00 AM

కోదాడ, ఫిబ్రవరి 15 : కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో వేంచేసి ఉన్న ప్రాచీన భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 వరకు ఉత్సవాలు జరుగుతాయని దేవాలయ చైర్మన్ యధా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి గుండపనేని వెంకట సత్యనారాయణ రావు, సునీత దంపతులు రూ.1.20 లక్షల విలువైన నూతన పంచలోహ విగ్రహాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య ,అర్చకులు నందుల శాస్త్రి, యాద సత్యనారాయణ, ఏడుకొండలు, సత్యనారాయణ, ప్రభాకర్, మదన్,పోతురాజు నర్సయ్య,కుక్కడపు పెద్ద వీరయ్య,ముక్కా రవి పాల్గొన్నారు.