తుది దశలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్... గెలుపెవరిది?
హైదరాబాద్ : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాల ప్రక్రియ మూడో రోజు కొనసాగుతుంది. కాసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు రానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డితో పాటు ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల సంఖ్య 50కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.
అంతిమంగా కౌంటిగ్ బరిలో 51వ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారని, గెలుపు కోటాకు దగ్గరలో 52వ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సూమారు 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు గంటల్లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక తుది ఫలితం తేలనుంది. తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.






