3 September, 2026 | 12:25 PM

తెలంగాణ నీటిపారుదల సలహాదారుడిగా ఏపీ మాజీ సీఎస్

07-06-2024 | 09:58pm

హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల, నీటి వనరుల సలహాదారుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై వ్యతిరేకంగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన వారికి తెలంగాణ నీటి పారుదల, నీటి వనరుల సలహాదారు పదవి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డు అధికారులను సలహదారులగా, ఓఎస్డీలుగా పలు పోస్టుల్లో నియమించి అక్రమాలకు పాల్పడిందని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడేందుకని అదే పని చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.