4 August, 2026 | 1:49 AM

చంద్రయాన్‌తో దేశం అగ్ర దేశాల పక్కన నిలిచింది

23-08-2024 08:32 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ఇస్రో చేపట్టిన చంద్రయాన్ విజయవంతమవడం గొప్ప చరిత్ర అని, చంద్రయాన్ తో దేశం అగ్ర దేశాల పక్కన నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగ శర్మ అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా శుక్రవారం  అంతరిక్ష పరిశోధనపై అవగాహన కార్యక్రమాలు ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అంతరిక్ష పరిశోధనలో భారతీయులు సాధించిన ఘనత కొనియాడారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రిజ్వానా బేగం అంతరిక్ష పరిశోధనలు వాటి ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్  సునీత పత్తి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.