కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు..
05-06-2024 07:05 PM
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ, జూన్ 19 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడింగించింది. దీంతో జైలు అధికారులకు కేజ్రీవాల్ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తన మధ్యంతర బెయిల్ ను పొడించాలని కోరిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్ పై జూన్ 7వ తేదీన విచారణ జరుగనుంది. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.






