23 July, 2026 | 3:31 PM

మోదీ ప్రమాణస్వీకారంపై అధికారిక నిర్ణయం

05-06-2024 05:53 PM

 న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో  అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నీతీశ్ కుమర్, పలువురు నేతలు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తొలి ఎన్డీఏ సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించింది. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. జూన్ 8వ తేదీన జరుగనున్న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుసగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారానికి ఎన్డీయే పక్షాలు హాజరుకానున్నాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నీతీశ్ రాష్ట్రపతి వద్దకు వెళ్లి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నట్లు తెలుసుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 లోక్ సభ స్థానాలను సాధించింది. ఈసారి టీడీపీ, జేడీయూ, శివసన, ఎల్ జేపీ పార్టీలదే ఎన్డీఏలో కీలకపాత్ర పోషించనున్నట్లు కనిపిస్తుంది.