23 July, 2026 | 3:28 PM

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

23-07-2026 02:20 PM

ఊర్కొండ: ముచ్చర్లపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో ప్రభావంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు చర్యలు, సూక్ష్మ నీటిపారుదల పరికరాల వినియోగంపై అధికారులు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.