calender_icon.png 19 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోవర్టులు బీఆర్ఎస్ పార్టీని నష్టం

18-07-2025 10:36:39 PM

మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత ఇతరులు పార్టీని వీడడం సంతసంతోషకరం

జడ్చర్ల పట్టణ‌ కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు

మహబూబ్ నగర్ : జడ్చర్ల మున్సిపాలిటీ కి చెందిన మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత , మున్సిపల్ 7 వ వార్డు కౌన్సిలర్ గుండు ఉమాదేవి  బిఆర్ఎస్ పార్టీని వీడి హైదరాబాద్ లోని  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  స్దానిక జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపధ్యంలో జడ్చర్ల బిఆర్ఎస్ పట్టణ యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జడ్చర్ల పట్టణ పరిధిలోని పాత బజార్ గాంధీ చౌరస్తా లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ సుభాన్ మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ స్వలాభం కోసం పార్టీ మారిందని ఆరోపించారు, మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి  పుణ్యమా అని కౌన్సిలర్లు గా గెలిచారని పేర్కొన్నారు, పార్టీకి పట్టిన  శని వదిలిందని విమర్శించారు. 

శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ 7 వ వార్డు కౌన్సిలర్ ఉమాదేవి గారు ఏ రోజు కూడా వార్డులో పర్యటించి అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు, మాజీ సర్పంచ్ గుండు వేంకటేశ్ తన భూములను కాపాడుకోవడానికి సమయం సరిపోదని ఘాటుగా వ్యాఖ్యానించారు, గుండు వేంకటేశ్ గిరి వల్ల‌ బిఆర్ఎస్ పార్టీ కి వున్న క్యాడర్ ఓటు బ్యాంకు పడిపోయిందని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాదని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుండు వేంకటేశ్ పార్టీ మారడం సంతోషకరమని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కౌన్సిలర్ గా వుండి నాలుగు తట్టలు మట్టి పోయలేదని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2023 ఎన్నికల కోవర్టులతో లక్ష్మారెడ్డి ఓటమి పాలయ్యారు అని పేర్కొన్నారు. అంజిబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రజాదరణ పొందిన నాయకుడు నాలుగురు పార్టీ నుంచి పోతే నష్టం ఏమి లేదని అన్నారు, కొందరు పార్టీ మారిన పార్టీ కి కొత్త రక్తం నింపే శక్తి లక్ష్మారెడ్డి కి వుందని పేర్కొన్నారు, స్వలాభం కోసం వచ్చిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారు పార్టీకి ద్రోహం చేశాన్నారు.