calender_icon.png 19 July, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో సిపిఐ కి తిరుగులేదు

18-07-2025 10:39:34 PM

గ్రామ గ్రామాన సిపిఐ జెండా ఎగరాలి 

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలంలోని హమాలీ కాలనీ నందు సిపిఐ మండల 4వ మహాసభ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ పురుడు పోసుకున్న గడ్డ లక్ష్మీదేవిపల్లి మండలం అన్నారు. మండలంలో పలు ప్రాంతాల అభివృద్ధికి సిపిఐ పార్టీ నాటి నుండి నేటి వరకు అనేక రకాల పోరాటాలను నిర్వహించి ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి సమస్యల పరిష్కారం దిశగా పని చేసిందని తెలిపారు. మండలంలో పోడు భూములు, అంబసత్రం భూముల సమస్యల పరిష్కారానికి సైతం భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి ప్రజల పక్షాన నిలబడిందని గుర్తు చేశారు. మండలంలో పలు ప్రాంతాలను సిపిఐ పార్టీ నిర్మించి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. మండలంలో  ఎటువంటి ఎన్నికలనైనా జయించగలిగే పటిష్టమైన నాయకత్వాన్ని కలిగి ఉందన్నారు. ఈ ప్రాంతం పూర్తి ఏజెన్సీ ప్రాంతమై ఉన్న ఇక్కడి ప్రజల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజాసేవే ముఖ్యమని భావించే నాయకత్వాన్ని కలిగి ఉన్నామన్నారు.ఈ సందర్భంగా హమాలి సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావును శాలువాలతో ఘనంగా సత్కరించారు.