18-07-2025 10:31:26 PM
మంథని,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ గా కోట రాజబాపును నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియామకమైన కోట రాజాబాపు రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కోట రాజాబాపు గతంలో కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ గా, రెండు పర్యాయాలు మహాదేవపూర్ సర్పంచ్ గా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, పార్టీకి సంబంధించిన పలు పదవులలో విషిష్ట సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత విశ్వాస పాత్రునిగా ఉంటూ దివంగత నేత దుద్దిళ్ళ శ్రీపాద రావు కి అత్యంత సన్నిహితునిగా మెలిగారు. ఆ తరువాత కూడా ఆయన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో అవినాభావ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. పార్టీలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవకాశం లభించింది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.