విద్యుత్ ఘాతంతో ఆవు మృతి
03-06-2026 05:42 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని ఏంద గ్రామానికి చెందిన ఉత్తం జాదవ్ కు చెందిన ఆవు విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లు గ్రామస్తులు, రైతు బంధువులు తెలిపారు. బుధవారం మేతకు వెళ్లిన ఆవు గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద మేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురైందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫారంకు కంచ లేకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. ఆవు మృతితో రైతుకు 40 వేల రూపాయలు నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని చెల్లించాలని గ్రామస్తులు కోరారు.






