3 June, 2026 | 6:49 PM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

03-06-2026 05:45 PM

కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోంది. అత్యంత అర్హత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత స్టూడెంట్ కిట్లు, ఉచిత యూనిఫామ్‌లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత టెక్స్ట్‌ బుక్స్, నోట్‌ బుక్స్ అందజేస్తున్నాం. కావున తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ కృష్ణమాచారి  పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు