18 August, 2026 | 4:08 PM

మెట్రో నగరాల్లో ‘కో వర్కింగ్ స్పేస్’

16-06-2024 02:30 AM

వీటి ఏర్పాటుతో ఐటీ సంస్థల్లో 15శాతం వృద్ధి

 ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి): ఓ మహిళ బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు చిన్న పాప. పాప ఆలనా పాలనను పనిమనిషికి అప్పగించి  ఆమె ఆఫీసుకు వెళ్తున్నది. రోజు ఆఫీసుకు వెళ్లడానికి ఆమెకు సుమారు గంటన్నర సమయం పడుతుంది. వర్షాకాలంలో ఆ సమయం మరింత పెరుగుతుంది. పనులు ముగించుకుని, వ్యయప్రయాసలోర్చి, ఇంటికి వచ్చి మళ్లీ ఆమె కుటుం బ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

ఇలాంటి వారి కష్టాలు వర్ణనాతీతం. అలాంటి వారి బాధలను చూసిన కొన్ని కార్పొరేట్ కంపెనీలు కొన్ని మెట్రో నగరా ల్లోని తమ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల కోసం ‘కో వర్కింగ్ స్పేస్’ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు విస్తరించి ఉన్న నగరాల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నాయి. దీంతో మహిళా టెకీల బాధలు తప్పినట్లయింది. ‘కో వర్కింగ్ స్పేస్’ అందుబాటులోకి రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కంపెనీల వృద్ధి కూడా 15శాతం పెరుగుతున్నదని ఓ అంచనా. మహిళలకు సౌకర్యవంతమైన పని వాతావర ణం కల్పించేందుకే యాజమాన్యాలు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వీటిని సెటప్ చేయడం లేదా తొలగించడం కూడా చాలా సుల భం కావడంతో యాజమాన్యాలు ప్రస్తు తం వీటి ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఫ్లెక్సిబుల్ స్పేస్ డిమాండ్ 15 శాతం మేర పెరిగింది

పెరుగుతున్న డిమాండ్..

భారత్ లోని నగరాలు, పట్టణాల్లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ విధానం మహిళా ఉద్యోగులకు సూట్ అవుతుందని ఐటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా పనికి ముందుకు సాగేందుకు వెసులుబాటు కలగడం యాజమాన్యానికి ప్రయోజనం చేకూరిస్తే, తమకు వీలైన సమ యంలో పని చేసుకునేందుకు వీలు కలగడం ఉద్యోగులకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి అందరూ ఆఫీసులకు రావాలనే నిర్ణ యం చాలా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌పైనే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. వర్క్ ఫ్రం హోం విధానం క్రమంగా తగ్గడంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ విధానానికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్- నగరాల్లో శాటిలైట్ ఆఫీసులు, బ్యాక్ ఎండ్ ఆఫీసులు పెరుగుతున్నాయి.