18 August, 2026 | 4:48 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

జేడీఏపై 18 % జీఎస్టీ సబబేనా!

16-06-2024 02:30 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి): సంయుక్త అభివృద్ధి ఒప్పందాల(జేడీఏ)పై 18 శాతం జీఎస్టీ విధించడంపై డైవ లపర్లు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూమి యజమానుల మధ్య అభివృద్ధి హక్కుల బదిలీ కోసం చేసుకునే ఈ జేడీఏపై 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదంటున్నారు. జేడీఏ ద్వారా భూమి క్రయ విక్రయాలు జరగవని, అలాంటప్పుడు భూమి బదిలీలపై పన్ను విధించడం డెవలపర్లపై అదనపు భారమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేడీఏపై పన్ను విధించొచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ డెవలపర్ సుప్రీం కోర్టులో పిల్ సైతం దాఖలు చేశాడు. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసి, విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

అయితే, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున.. జేడీఏలపై డెవలపర్లు జీఎస్టీ చెల్లించాల్సి వస్తున్నది. వాస్తవానికి జేడీఏ అనేది ఓ ప్రాజెక్టులో భూయజమాని, రియల్ ఎస్టేట్ డెవలపర్  కలిసి పనిచేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో భూ యజమాని భూమి ఇస్తాడు. డెవలపర్ ఆ భవనం నిర్మిస్తాడు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాడు. దీనిలో క్రయవిక్ర యాలకు ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో మూడో పక్షానికి నిర్మాణాలను విక్రయించినప్పుడు మాత్రమే జీఎస్టీ విధించాలని డెవలపర్లు కోరుతున్నారు. జేడీఏలపై జీఎస్టీ విధిస్తే రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడుతుందని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ఉన్నందున డెవలపర్లు ఆ ప్రాపర్టీ ధరను పెంచాల్సి వస్తుందని, ఫలితంగా ఆ ప్రభావం కొనుగోలుదారులపై పడుతుందన్నారు. ఇప్పటికే జేడీఏపై స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నన్నామని, మళ్లీ అదనంగా జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.