22 April, 2026 | 12:41 PM

Breaking News

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •  

ఈనెల 20న సీపీఐ జిల్లా జనరల్ బాడీ, నిర్మాణ కౌన్సిల్ సమావేశం

12-08-2024 04:46 PM

కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో ఈనెల 20వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కరీంనగర్ జిల్లా జనరల్ బాడీ మరియు నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ లోని  బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. 

ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ... భారత కమ్యూనిస్టు పార్టీనీ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసుకునేందుకు నిర్మాణాన్ని పెంపొందించుకోవడం కోసం అన్ని జిల్లాల్లో సీపీఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయనన్నారు. ఈనెల చివరి వారంలో హన్మకొండలో జరుగనున్న రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నేపథ్యంలో కరీంనగర్ జిల్లా సీపీఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఈనెల 20వ తేదీన హుజురాబాద్ పట్టణంలో నిర్వహిస్తామన్నారు.

పార్టీ జనరల్ బాడీ సమావేశం కూడా జరుగుతుందని, ఈ సమావేశాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎం.ఎల్.ఎ కూనంనేని సాంబశివ రావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరవుతున్నారని, సమావేశాలను జయప్రదం చేయడానికి జిల్లా వ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలు సిద్ధం కావాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు.