20 April, 2026 | 5:59 PM

గ్రామ గ్రామాన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి

20-04-2026 04:48 PM

- సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

గుండాల,(విజయక్రాంతి): పీడిత ప్రజల ఆశాజ్యోతి సిపిఐ(ఎంఎల్) పార్టీ ఏప్రిల్ 22న ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు లెనిన్ జయంతి రోజున భారతదేశంలో ఆవిర్భవించిన సందర్భంగా మండలంలోని గ్రామ గ్రామాన పార్టీ జన్మదినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి అరెం నరేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1969 ఏప్రిల్ 22న సిపిఐ (ఎంఎల్) ఆవిర్భవించి దున్నేవానికి భూమి కావాలని, మనిషిని వేరొక మనిషి దోచుకోకూడదని, అసమానతలు లేని సమాజం కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, ఈ పోరాటాలలో అనేకమంది తమ విలువైన ప్రాణాలు పేద ప్రజల కోసం రక్తతర్పణ చేశారని అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ గ్రామ గ్రామాన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.