31 August, 2026 | 12:50 AM

పాత్రికేయుల ఇండ్ల స్థలాలకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతు

31-08-2026 12:07 AM

కొత్తగూడెం, ఆగస్టు 30,  (విజయక్రాంతి):  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసమే పనిచేసే ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ పాలకవర్గాలు, కేంద్ర ప్రభుత్వం ఏమో అటవీ సంపదని కార్పోరేట్ కంపెనీలకు ధారాధత్వం చేసే దాంట్లో భాగంగా ఒక ఎకరాకు ఒక రూపాయి చొప్పున ఇచ్చినటువంటి కేంద్ర బిజెపి ప్రభుత్వం. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫీసుల పేరుతో గజం 100 రూపాయల చొప్పున ధారాధత్వం చేస్తా ఉంది.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు,చేసే అటువంటి న్యాయమైన డిమాండు వీరికి కనపడదా అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం.  ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాత్రికేయ మిత్రుల న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించాలని,మిత్రులు తీసుకునేటువంటి ఏ కార్యక్రమానికైనా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ పెద్ద చంద్రన్న పార్టీ) మద్దతుగా ఉంటుందన్నారు. మాదారపు ఉమాశంకర్, సప్పిడి వెంకటేశ్వర్లు,గోపి,రాము పాల్గొన్నారు.