31 August, 2026 | 1:46 AM

గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

31-08-2026 12:49 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి, నిరుపేదల సం క్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అయ్యవారిపల్లిలో రూ.10 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రాజకీయాలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, మొదటి విడతలో రానివారికి రెండో విడతలో మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.