గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి
బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల వీరప్రసాద్ గౌడ్
గరిడేపల్లి, ఆగస్టు 30,(విజయ క్రాంతి): గరిడేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కనీస వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల వీరప్రసాద్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.గరిడేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బస్టాండ్‌లో మహిళలకు బాత్రూం, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, కోదాడ నుంచి వచ్చే బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్న ప్రమాదకర భవనాన్ని వెంటనే మరమ్మతు చేయాలని, పరిసరాల్లో మద్యం సీసాలు తొలగించి పరిశుభ్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు






