ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత
దోమకొండ, ఆగస్టు 30 (విజయ క్రాంతి): దోమకొండ మండలంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్ గృహప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించి, నూతన వస్త్రాలను అందజేశారు.
దోమకొండకు చెందిన అబ్రాబోయిన మాధవి–రవి, ఎట్ల సరస్వతి–కిష్టయ్య, ఆశంశెట్టి రజిత-మల్లేశం, కంది కళావతి–లక్ష్మణ్ తదితరులు ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేశారు.ఈ సందర్భంగా తిర్మల్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో మండలానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు రావడం సంతోషకరమన్నారు. లబ్ధిదారుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారామ మధు, నాయకులు బత్తిని సిద్ధ రాములు, మరి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నర్సింలు, షమ్మీ, కొండ ఆంజనేయులు, నాగేంద్ర వర్మ, ఖలీం, బట్టు రాములు, బాపురెడ్డి, నిమ్మ బాలరాజు,రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.






