31 August, 2026 | 1:34 AM

పాల్వంచ బాలుడి అద్భుత ప్రతిభ

31-08-2026 12:08 AM
  1. ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అబ్దుల్ నుమాన్‌కు రెండు స్వర్ణ పతకాలు
  2. అద్భుత ప్రదర్శనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు

పాల్వంచ, ఆగస్టు 30,  (విజయక్రాంతి): హైదరాబాద్లోని కాటేదాన్ స్పోరట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ స్పోరట్స్, ఆల్ స్టైల్స్ మార్షల్ ఆరట్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్వంచకు చెందిన బాల క్రీడాకారుడు అబ్దుల్ నుమాన్ అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్, పాల్వంచకు చెందిన అబ్దుల్ నుమాన్, మాస్టర్ రాంబాబు ల శిక్షణలో ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కటా, వెపన్ కటా విభాగాల్లో పోటీపడి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రెండు స్వర్ణ పతకాలను సాధించాడు. 

పోటీల్లో అబ్దుల్ నుమాన్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనను గుర్తించిన నిర్వాహకులు అతనికి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డ్ కూడా అందజేశారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై రెండు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకోవడం పట్ల నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్ మాస్టర్ రాంబాబు, తల్లిదండ్రులు, పాల్వంచ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అబ్దుల్ నుమాన్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పాల్వంచకు, తెలంగాణకు , దేశానికి మరింత పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.