13 March, 2026 | 5:43 AM

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు

02-08-2024 11:28 AM

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి వదిలేసిన చెప్పుల్లో.. కాంగ్రెస్ పార్టీ కాళ్లు పెట్టి నడుస్తున్నట్లు ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నామని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ కొట్ట మిట్టాడుతోందని చెప్పారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త న్యాయ చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయని కూనంనేని హెచ్చరించారు. అటు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ చట్టాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది.