14-06-2025 10:53:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కూనమనేనిన బొకే అందించి, శాలువాతో సత్కరించి సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ నుండి కొత్తగూడెం వెళుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు సిపిఐ జిల్లా ఆఫీస్ కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెరుగు కుమార్ తండ సందీప్, కట్లోజు పాండురంగ చారి వరిపల్లి వెంకన్న వీరవెల్లి రవి, బానోతు లింగ్య నాయక్, మేక వీరన్న, మంద శంకర్, నక్క నాగార్జున, డి.రమేష్, తండా శ్రీనాథ్, నాంచారి దాసు, లాలు, మేక వెంకటేష్, చిలువేరు వికాస్ పాల్గొన్నారు.