సీఎంతో సీపీఎం, సీపీఐ నేతలు వేర్వేరుగా భేటీ
26-05-2026 01:59 AM
- కనీస వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేసిన వామపక్ష నేతలు
- పంట కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: సీఎం
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలో సీపీఎం బృందం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం నేతృత్వంలో ఆ పార్టీ బృం దం సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి గింజ కొనడం లేదని, పంట కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రైతు లు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు. మూసీపై బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని, మూసీని అద్భుతమైన పర్యాటకం చేస్తామన్నారు.






