17 August, 2026 | 4:00 AM

18న సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు.. సిపిఎం జిల్లా కార్యదర్శి

17-08-2026 12:14 AM

మచ్చా వెంకటేశ్వర్లు

కొత్తగూడెం టౌన్,ఆగస్టు 16 (విజయక్రాంతి): సిపిఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ఆగష్టు 18న సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పర్యటన నిర్వహించనున్నట్లు   సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచికంటి భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగష్టు 15వ తేదీన తుమ్మల చెరువుకి సీతారామ కాలువకు ద్వారా 7.89 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పిన మంత్రి తుమ్మల మాటలు అవాస్తవంగా మారాయన్నారు.

మంత్రుల మాటలు నమ్మి నార్లు పోసిన రైతులకు నిరాశే మిగిలిందని విమర్శించారు. అబద్దాలు ప్రచారం చేస్తూ మూడు జిల్లాల రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ నిర్లక్యంపై పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతమ్మ సాగర్  బహుళ  ప్రయోజనాల ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదన్నారు.

ప్రాజెక్టే లేకుండా నీళ్ళు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 413 చెరువులకు సీతారామ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్న ఆచరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లో సమగ్రంగా సాగునీరు అందించే ప్రణాళిక ప్రభుత్వం ముందు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సత్యనారాయణ, బ్రహ్మచారి, బాలరాజు, శ్రీనివాస్, పాల్గొన్నారు .