17 August, 2026 | 12:48 AM

వాజ్‌పేయికి బీజేపీ నేతల ఘన నివాళి

17-08-2026 12:15 AM

దోమకొండ, ఆగస్టు 16(విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి  వర్ధంతిని పురస్కరించుకుని  దోమకొండ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వాజ్పేయి దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

వాజ్పేయి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ దోమకొండ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తిప్పాపురం రవి, నాయకులు రాజేష్, రాము, 106వ బూత్ అధ్యక్షుడు భరత్, శివ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.