26 June, 2026 | 3:17 AM

నేడు నిర్మల్ జిల్లాలో ఇన్‌చార్జ్ మంత్రి పర్యటన

26-06-2026 01:30 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎమ్మెల్యే 

బైంసా, జూన్ 25 (విజయక్రాంతి): బైంసా మున్సిపాలిటీ పరిధిలో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తద్రి, మున్సిపల్ కమిషనర్ సిద్ధికి కుతిజా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.