19 April, 2026 | 7:54 AM

సీసీ కెమెరాలతో అదుపులోకి నేరాలు

21-06-2025 01:40 PM
  1. పట్టణంలో నూతనంగా 73 సీసీ కెమెరాలు ఏర్పాటు
  2. ఎమ్మెల్యే పద్మావతి,
  3. జిల్లా ఎస్పీ నరసింహ

కోదాడ: నేరాలు పసి కట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం(Kodad MLA Padmavathi Uttam) జిల్లా ఎస్పీ నర్సింహ లు అన్నారు. శనివారం కోదాడ పట్టణ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 27.50 లక్షలతో ఏర్పాటు చేసిన 73 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. సిసి కెమెరా ఏర్పాటు పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారాలు ఉంటాయన్నారు... అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.... ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు.

నేరస్థులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ద్రోహదా పడతాయన్నారు. రాత్రి సమయాలలో ఆకతాయిలో అల్లరి మూకలను గుర్తించేందుకు కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి త్వరితగతన ఏర్పాటు చేస్తున్నందుకు పట్టణ పోలీస్ శాఖను వారి ప్రత్యేకంగా అభినందించారు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐలు శివశంకర్ రజిత రెడ్డి టి పి సి సి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు మేళ్లచెరువు కోటేశ్వరరావు కొమరగిరి రంగారావు తదితరులున్నారు.