12 May, 2026 | 1:24 AM

నకిలీ విత్తనాలు క్రిమినల్ కేసులు

12-05-2026 12:00 AM

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి

నిర్మల్ మే 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాల పట్ల ప్రభు త్వం కఠినంగా వివరిస్తుందని వాటిని విక్రయించిన ప్రోత్సహించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మెన్ మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, వారి ఉన్నతికి విత్తన సంస్థ పనిచేస్తుందని, డీలర్లు అందరూ ప్రభుత్వం తయారు చేసే విత్తనాలు రైతులు సాగు చేసుకునేలాగా ప్రచారం కల్పించాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు అన్ని నాణ్యతా పరంగా ఉత్తమమైనవి అని అన్నారు. ధర తక్కువ ఉండటంతో పాటుగా, దిగుబడి కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

అనుమతులు లేని ప్రైవేట్ విత్తనాల కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, నాసిరకం విత్తనాలు అమ్ముతున్నాయని వివరించారు. దీని ద్వారా రైతులు నష్టపోతున్నా ర ని పేర్కొన్నారు. డీలర్లు ఎట్టిపరిస్థితుల్లో నకిలీ విత్తనాలు విత్తనాలు రైతులకు అమ్మరాదని హెచ్చరించారు. సహకార సంఘాలు, మహిళా సంఘాలు విత్తన సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందించాలని తెలిపారు.

విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్ వల్ల రైతులకు లాభాలు:

విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విత్తనాలు వల్ల రైతులకు చాలా లాభాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సంస్థ తయారు చేసే విత్తనాలు అన్ని ఎన్నో నాణ్యతా పరీక్షల తర్వాత విపణిలోకి వస్తాయన్నారు. ఈ విత్తనాలు సాగు చేయడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందగలుగుతారని చెప్పారు.

అలాగే నకిలీ విత్తనాల నుంచి కూడా రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. విత్తన డీలర్లు అందరూ రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు వినియోగించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజి ప్రసాద్, శ్రీధర్, డిఆర్డిఓ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, ఇతర అధికారులు, విత్తన డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.