28 June, 2026 | 3:01 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

రైస్ బ్రాన్ ఆయిల్‌తో ఆరోగ్యం

12-05-2026 12:00 AM

సమతుల్యంగా కొవ్వులు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత పరిస్థితులు సర్వసాధారణం అవుతున్నందున, భారతీయ వినియోగదారులు తమ ఆహారంలోని కొవ్వుల నాణ్యత గురించి మరింత శ్రద్ధ వహిస్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ ఈ విధానానికి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే ఇది తక్కువ సంతృప్త కొవ్వులతో పాటు, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను సమతుల్య నిష్పత్తిలో అందిస్తుంది.

దీనిని సాధారణ ఆహారంలో భాగం గా క్రమం తప్పకుండా ఉపయోగించినప్పు డు, ఈ సమతుల్యత గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది మంచి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, చెడు కొవ్వును తగ్గి స్తుంది. భారతీయ గృహాల రోజువారీ వంట అవసరాలకు ఉత్తమంగా సరిపోతుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో పిహెచ్‌డి, కన్సల్టెంట్ ఫుడ్ టెక్నాలజిస్ట్, కన్సల్టెంట్ న్యూట్రి షనిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ రోహిణి శర్మ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రైస్ బ్రాన్ ఆయి ల్--2023లో మాట్లాడుతూ.. రైస్ బ్రా న్ ఆయిల్ చాలా ఆరోగ్యకరమైన నూనె.

ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడకం వల్ల కలిగే ప్ర యోజనాలను ఎక్కువ మంది తెలుసుకోవాలి అన్నారు. ఐటీ నిపుణురాలైన రియా శర్మ మాట్లాడుతూ.. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తేలికగా ఉంటుంది, వండిన తర్వాత బరువుగా అనిపించదు, వివిధ రకాల వంటకాలకు బాగా సరిపోతుంది అని చెప్పారు. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, సేల్స్ అండ్ మా ర్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తమ రోజువారీ ఆహార ఎంపికల పట్ల మరింత అవగాహన పెంచుకుంటున్నారు.

ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో 10000 పీపీఎం కం టే ఎక్కువ ఒరైజనాల్తో పాటు, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి సహజ యాం టీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. గత కొన్ని నెలలుగా, రైస్ బ్రాన్ ఆయిల్ ధర ఇతర సాధారణ నూనెలతో సమానంగా ఉంది, ఇది భారతీయ గృహాలకు ఆదర్శవంతమైన ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తోంది అని సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరెడ్డి అన్నారు.