ప్రెస్‌క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
12-05-2026 12:00 AM
మంత్రి దామోదర రాజనర్సింహ
ఖైరతాబాద్, మే 11 (విజయక్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ మం త్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ప్రెస్ క్లబ్ సభ్యులు మంత్రిని సచివాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, సమస్యలపై విన్నవించగా మంత్రి మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావ వారోత్సవా ల్లో భాగంగా నిమ్స్ లో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి ఉన్నారు.






